హరిద్వార్: భారత కబడ్డీ మాజీ కెప్టెన్ దీపక్ హుడా ప్రాణాలతో బతికిపోయాడు. హరిద్వార్ దగ్గర గంగా నదిలో కొట్టుకుపోతున్న దీపక్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు కాపాడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దీపక్.. మెహమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశాడు. భారీ వరద నుంచి తనను కాపాడిన ఉత్తరాఖండ్ పోలీసులకు ఈ సందర్భంగా అతడు కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలాఉండగా ఎడతెరిపిలేని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లో గంగా నది భీకర స్థాయిలో ప్రహిస్తున్నది.