Graham Thorpe | లండన్: ఇటీవలే మరణించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ది సహజ మరణం కాదని, బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన భార్య అమంద వెల్లడించింది.అమంద మాట్లాడుతూ..‘గత కొన్నేండ్లుగా గ్రాహం తీవ్ర ఒత్తి డి, ఆందోళనతో బాధపడుతున్నాడు. గతంలో 2022 మేలో ఒకసారి ఆత్మహత్యకు యత్నించాడు.
అప్పుడు చాలా రోజులు ఐసీయూలో ఉండి ప్రాణాలతో బయటపడ్డాడు. అయినా ఆ యన డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోయాడు. కుటుంబంగా మేం ఆయనకు ఎంతో అండగా నిలిచాం. మెరుగైన చికిత్సను అం దించాం. రెండేండ్ల నుంచి మానసిక కుంగుబాటులో కూరుకుపోయిన ఆయన ఆ బాధ నుంచి బయటపడలేకపోయారు’ అని తెలిపింది.