Rishabh Pant | పంత్‌పై కెప్టెన్సీ భారం.. స్వేచ్ఛగా ఆడనిస్తేనే లక్నోకు మంచిది..!
Rishabh Pant : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) నాయకుడిగా, ఆటగాడిగా రిషభ్ పంత్ (Rishabh Pant) విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో పంత్‌ను కెప్టెన్‌గా తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Rishabh Pant : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) నాయకుడిగా, ఆటగాడిగా రిషభ్ పంత్ (Rishabh Pant) విఫలమవుతున్నాడు. కెప్టెన్సీ భారం వల్లనే పంత్ తన సహజ స్టయిల్లో ఆడలేకపోతున్నాడని మాజీలు అంటున్నారు. ముంబై ఇండియన్స్‌పై పంత్ సారథిగా తేలిపోయాడని కామెంటేటర్ షాన్ పొలాక్ (Shan Pollock) మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో పంత్‌ను కెప్టెన్‌గా తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మాజీ ఆటగాళ్లు మనోజ్ తివారీ, రోహన్ గవాస్కర్‌లు అతడిని సారథిగా తప్పించాలని లక్నో యాజమాన్యానికి సలహా ఇచ్చారు.
పద్దెనిమిదో సీజన్ మెగా వేలంలో రూ.27.25 కోట్ల రికార్డు ధరకు లక్నో గూటికి చేరిన పంత్ స్థాయికి తగ్గట్టు ఆడడం లేదు. కెప్టెన్‌గానూ దారుణంగా విఫలమవతున్నాడీ టీమిండియా స్టార్. అతడి సారథ్యంలో ఎల్ఎస్జీ 23 మ్యాచుల్లో కేవలం ఎనిమిదింటిలోనే గెలుపొందింది. పంతొమ్మిదో సీజన్లో లక్నో అట్టడుగున నిలవడంలో పంత్ వైఫల్యాన్ని కొట్టిపారేయలేం. అందుకని.. అతడని సారథిగా తప్పించి బ్యాటర్‌గా స్వేచ్ఛగా ఆడేలా చూడాలని రోహన్ గవాస్కర్, మనోజ్ తివారీలు యజమాని సంజీవ్ గొయెంకాకు సూచించారు.
After their latest defeat to Mumbai Indians, former India cricketers @tiwarymanoj and @rohangava9 urged the Lucknow Super Giants to relieve Rishabh Pant of leadership duties to revive his batting form.#IPL2026 #MIvLSG https://t.co/pCNFptwqbr
— Circle of Cricket (@circleofcricket) May 5, 2026
‘ఒకానొక ఇంటర్వ్యూలో పంత్ లక్నోకు 10 -15 ఏళ్లు ఆడాలని.. పలు టైటిళ్లు గెలవాలని కోరుకుంటున్నానని సంజీవ్ గొయాంకా అన్నారు. అలాంటప్పుడు కొందరు ఆటగాళ్లను ఒత్తిడి పడకుండా చూడాలి. పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలా? వద్దా? అనేది లక్నో యాజమాన్యం నిర్ణయించుకోవాలి. విధ్వంసక ఆటగాడైన పంత్‌ను బ్యాటర్‌గా ఆడించాలి. ఎందుకంటే ఆకాశమే హద్దుగా చెలరేగి.. ఒంటిచేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చగల సత్తా అతడి సొంతం. అయితే.. జట్టు ప్రదర్శన బాగా లేనప్పుడు ఆ ఒత్తిడి కెప్టెన్‌పై పడుతుంది.

కాబట్టి పంత్‌ను కెప్టెన్‌గా తప్పించి స్వేచ్ఛగా ఆడేలా చూడాలి’ అని క్రిక్‌బజ్‌తో గవాస్కర్ వెల్లడించాడు. మనోజ్ తివారీ మాట్లాడుతూ పంత్‌కు సారథ్యమిచ్చి.. అతడిలోని బ్యాటర్‌ను మనం మిస్సవుతున్నామని అన్నాడు. ‘కెప్టెన్సీ ఒత్తిడిలో పంత్ దూకుడైన ఆటను మనం కోల్పోతున్నాం. అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో ఒకప్పుడు దంచేసిన అతడు.. పంతొమ్మిదో సీజన్లో పరుగులే చేయడం లేదు. సో.. కెప్టెన్సీ భారం నుంచి విముక్తి లభిస్తే పంత్ తన స్టయిల్లో చెలరేగుతాడు. అది లక్నో జట్టుకు ఎంతో మంచిది’ అని తివారీ వెల్లడించాడు. ఐపీఎల్ 19లో ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచుల్లో ఏడింటా ఓడిన లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్టే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

