Sanath Jayasuriya | భారత్కు ధన్యవాదాలు తెలిపిన లంక మాజీ క్రికెటర్ జయసూర్య
Sanath Jayasuriya | పొరుగు దేశంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభం మధ్య ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న జనానికి ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య తన మద్దతును ప్రకటించారు. కష్ట సమయాల్లో దేశానికి సహాయం అందించినందుకు భారత్కు ధన్యవాదాలు తెలిపాడు. శ్రీలంకలో ఉద్యమయం ప్రారంభమైన జూలై 9వ తేదీని జన్ దివస్ (పబ్లిక్ డే)గా అభివర్ణించాడు. సంక్షోభం ప్రారంభం నుంచి భారత్ తమ దేశానికి సహాయం చేసిందని, ఇంకా మానవతా సాయం అందిస్తోందని, దీనికి తామంతా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జయసూర్య పేర్కొన్నారు.
దేశంలో పరిస్థితులపై మాట్లాడుతూ శ్రీలంకలోని నిరసనకారులతోనే తాను ఉన్నాని, కానీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఐఎంఎఫ్, భారత్ సహా ఇతర స్నేహపూర్వక దేశాలు శ్రీలంకకు సహాయం చేస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రికెట్లో తన బ్యాటింగ్తో సిక్సర్ల మోత మోగించిన జయసూర్యను పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించగా.. తాను రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

