శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 19, 2020 , 15:52:05

గుండెపోటుతో వెటరన్‌ క్రికెటర్‌ కన్నుమూత

గుండెపోటుతో వెటరన్‌ క్రికెటర్‌ కన్నుమూత

బెంగళూరు:  ప్రముఖ మాజీ క్రికెటర్‌ గోపాలస్వామి కస్తూరి రంగన్‌(89) గుండెపోటుతో బుధవారం తన నివాసంలో కన్నుమూశారు. 'జి కస్తూరి రంగన్‌ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. చామరాజపేటలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.'అని కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(కేఎస్‌సీఏ) ట్రెజరర్‌, అధికార ప్రతినిధి వినయ మృత్యుంజయ తెలిపారు.  మాజీ క్రికెటర్‌-అడ్మినిస్ట్రేటర్‌ అయిన రంగన్‌  కేఎస్‌సీఏ ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ  క్యూరేటర్‌గానూ పనిచేశారు. 

1948 నుంచి 1963 మధ్య రంజీ ట్రోఫీలో మైసూర్‌ తరఫున ఎక్కువగా మ్యాచ్‌లు ఆడారు.  1962-63లో కర్ణాటకు ప్రాతినిధ్యం వహించారు.  కుడిచేతి మీడియం బౌల‌ర్‌గా రాణించారు. కస్తూరి రంగన్‌ మృతికి మాజీ క్రికెటర్లు సంతాపం ప్రకటించారు. క్రికెట్‌ అభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేశారని మాజీ కెప్టెన్‌, కోచ్‌ అనిల్‌ కుంబ్లే ట్వీట్‌ చేశారు.  


logo