ఆసియా కప్‌లో కోహ్లీ ప్రదర్శన చూసిన తర్వాత అతను ఫామ్ అందుకున్నాడని అభిమానులు ఆశించారు. అలాగే అతనికి మంచి రికార్డున్న మొహాలీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లీ ఇరగదీస్తాడని భావించారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేసిన కోహ్లీ.. 7 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.
నాథన్ ఎల్లీస్ వేసిన బంతిని లాంగాన్ మీదుగా బాదేందుకు కోహ్లీ ప్రయత్నించగా.. బంతి సరిగా కనెక్ట్ కాలేదు. దీంతో కామెరూన్ గ్రీన్‌కు చాలా ఈజీ క్యాచ్ దొరికింది. ఈ షాట్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మండిపడ్డాడు. ‘అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని బంతులు ఆడి సింగిల్స్, డబుల్స్ తీసుకోవాల్సింది. కొన్నిరోజుల క్రితమే సెంచరీ చేశాడు.
అలాంటి ఫామ్‌ను వృధా చేసుకోకూడదు. కొంచెం టైం తీసుకొని సెటిల్ అవ్వాలి’ అని చెప్పాడు. అలాగే కోహ్లీ వంటి నాణ్యమైన ఆటగాళ్లు బంతిని ఆరంభం నుంచే గాల్లోకి లేపాల్సిన అవసరం లేదని, సెట్ అయిన తర్వాత భారీ షాట్లకు వెళ్లాలని సలహా ఇచ్చాడు. మరి శుక్రవారం జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఎలా ఆడతాడో చూడాలి.