జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ జూనియర్ ఫుట్‌బాలర్ ల్యూక్ ఫ్లర్స్ దారుణ హత్యకు గురయ్యాడు. దేశంలోనే ప్రముఖ సాకర్ క్లబ్‌గా పేరొందిన కైజర్ చీఫ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ల్యూక్ హైజికింగ్లో ప్రాణాలు కోల్పోయినట్లు గురువారం స్థానిక పోలీసు అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఒక పెట్రోల్ బంక్‌లో ల్యూక్‌ను అడ్డుకున్న దుండగులు ఛాతిపై కాల్పులు జరిపి అతని కారులో పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది. తుపాకులు ధరించిన ఇద్దరు దండుగులు ఈ హత్యకు పాల్పడినట్టు మావెల మాసాండో వివరించాడు.