బార్బడోస్: అమెరికా, వెస్టిండీస్ వేదికలు జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్(T20 Worldcup).. రెండో స్టేజ్‌కు చెందిన జట్ల వివరాలు ఖరారు అయ్యాయి. సూపర్-8 స్టేజ్‌లో ఏ జట్టు ఎవరితో ఆడుతుందో తేలిపోయింది. ఎక్కడ ఆ మ్యాచ్‌లు జరుగుతాయి, ఏ రోజు ఆ మ్యాచ్ ఉంటుందో.. ఆ వివరాలను ఐసీసీ వెల్లడించింది. గ్రూప్ ఏ నుంచి ఇండియా, అమెరికా, గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, గ్రూప్ సీ నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, గ్రూప్ డీ నుంచి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు సూపర్-8 దశకు అర్హత సాధించాయి.
సూపర్-8 మ్యాచ్‌ల కోసం 8 జట్లను రెండు గ్రూపులగా విభజించారు. గ్రూప్ 1లో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక గ్రూప్ 2లో వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అమెరికా జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు ఈ గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. రెండు గ్రూపుల్లో టాప్ నిలిచే రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
జూన్ 19వ తేదీ నుంచి ఆంటిగ్వాలో సూపర్ 8 స్టేజ్ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. అమెరికా, సౌతాఫ్రికా మధ్య ఫస్ట్ మ్యాచ్ ఉంది. అదే రోజు సెయింట్ లూసియాలో వెస్టిండీస్, ఇంగ్లండ్ తలపడుతాయి. జూన్ 20వ తేదీన బార్బడోస్‌లో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటుంది. కరీబియన్ వేదికగా ఈ టోర్నీలో ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనున్నది. జూన్ 22వ తేదీన బంగ్లాదేశ్‌తో ఇండియా రెండవ మ్యాచ్ ఆడనున్నది. ఇక జూన్ 24వ తేదీన ఆస్ట్రేలియాతో ఇండియా సూపర్8 స్టేజ్‌లో తన మూడవ మ్యాచ్ ఆడనున్నది.
ఆంటిగ్వా, బార్బడోస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ వేదికగా సూపర్ 8 దశలో మొత్తం 12 మ్యాచ్‌లు జరగనున్నాయి.
The schedule for the Super Eight stage of the #T20WorldCup has now been finalised 👀
Details ➡ https://t.co/aGL9xFje0A pic.twitter.com/FKqtnBXxrW
— T20 World Cup (@T20WorldCup) June 17, 2024