హైదరాబాద్, ఆట ప్రతినిధి: వయసు ఒక నంబర్ మాత్రమేనని నిరూపించారు మర్రి లక్ష్మణ్‌రెడ్డి(ఎమ్ఎల్ఆర్). ఎనిమిది పదుల వయసులో కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఏకంగా ఐదు పతకాలతో సత్తాచాటారు.
చండీగఢ్(పంజాబ్) వేదికగా జరిగిన 7వ జాతీయ స్విమ్మింగ్ టోర్నీలో 81 ఏండ్ల లక్ష్మణ్‌రెడ్డి 400మీటర్ల ఫ్రీస్టయిల్తో పాటు 200మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణాలు, 100మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రజతం, రిలే ఈవెంట్లలో రెండు కాంస్యాలు సొంతం చేసుకున్నారు. ఐదు పతకాలు సాధించిన లక్ష్మణ్‌రెడ్డిని ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రత్యేకంగా అభినందించారు.