హైదరాబాద్, ఆట ప్రతినిధి: బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగనున్న అండర్-19 చాలెంజర్ ట్రోఫీకి హైదరాబాద్ క్రికెటర్లు ధీరజ్గౌడ్, మురుగన్ అశ్విన్, నిశాంత్, అవినాశ్రావు ఎంపికయ్యారు. శుక్రవారం నుంచి మొదలయ్యే టోర్నీలో వీరు ఇండియా ఏ, బీ, సీ, డీ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు..యువ క్రికెటర్లను ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు సయ్యద్ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 19 వికెట్లతో సత్తాచాటిన యువ పేసర్ రవితేజతో పాటు మహిళల సీనియర్ టోర్నీలో 15 వికెట్లు తీసిన శ్రావణి భవిష్యత్లో ఇదే రీతిలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.