ఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు మొట్టమొదటి ఫిట్నెస్ కోచ్‌గా పనిచేసిన కెప్టెన్ కేబీ డోగ్రా (89) కన్నుమూశారు. పదిరోజుల క్రితం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించినట్టు డోగ్రా కుటుంబసభ్యులు శుక్రవారం వెల్లడించారు. పాతతరం క్రికెటర్లు సునీల్ గవాస్కర్, మోహిందర్ అమర్నాథ్, బిషన్‌సింగ్ బేడీ వంటి దిగ్గజాలకు ఆయన ఫిట్నెస్ పాఠాలు చెప్పారు. మోహిందర్ అమర్నాథ్ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ వహించేవారని డోగ్రా పలు సందర్భాలలో చెప్పేవారు. 1970-80 కాలంలో భారత్‌కు ఆడిన చాలామంది క్రికెటర్లు డోగ్రా వద్ద ఫిట్నెస్ పాఠాలు నేర్చుకున్నవారే.
ఆధిక్యంలో అర్జున్
చెన్నై: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ జోరు కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన మాస్టర్స్ కేటగిరీలో వరల్డ్ నంబర్2 అర్జున్..అమిన్ తబాట్బయిపై గెలిచి టాప్‌లోకి దూసుకెళ్లాడు. నాలుగు రౌండ్లు ముగిసే సరికి అర్జున్ 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మాక్సిమ్తో గేమ్‌ను విదిత్ గుజరాతి, ఆరోనియన్‌తో అరవింద్ గేమ్‌లు డ్రా చేసుకున్నారు.