గ్లాస్గోవ్: టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ మ్యాచ్ మూడవ సూపర్ ఓవర్(Super Over)లో డిసైడ్ అయ్యింది. ట్రై సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్, నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. టీ20ల్లో ఓ మ్యాచ్ మూడవ సూపర్ ఓవర్లో నిర్ణయం తేలడం ఇదే మొదటిసారి. మూడవ సూపర్ ఓవర్లో మైఖేల్ లెవిట్ భారీ సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో నేపాల్ జట్టు చివరి ఓవర్లో 16 రన్స్ చేయాల్సి ఉంది. అయితే టెయిలెండర్ నందన్ యాదవ్ ఆఖరి రెండు బంతుల్లో బౌండరీలు కొట్టి స్కోర్లను సమం చేశాడు. మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
తొలి సూపర్ ఓవర్లో నేపాల్ 19 పరుగులు చేసింది. దాంట్లో కుసాల్ భుర్తల్ 18 రన్స్ చేశాడు. అయితే డచ్ ఓపెనర్ ఓదౌద్ అయిదో, ఆరో బంతిని భారీ షాట్లుగా మలిచాడు. అయిదో బంతిని సిక్సర్, ఆరో బంతికి ఫోర్ కొట్టి.. స్కోర్లను సమం చేశాడు. ఇక రెండో సూపర్ ఓవర్లో నెదర్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. దాంట్లో 17 రన్స్ స్కోర్ చేసింది. ఆ ఓవర్ కూడా రసవత్తరంగా సాగింది. కైల్ క్లెయిన్ వేసిన లాస్ట్ బంతిని.. దీపేంద్ర సింగ్ సిక్సర్ కొట్టడంతో ఆ ఓవర్ కూడా డ్రా అయ్యింది. దీంతో మూడో సారి షూట్ఔట్ ఓవర్‌కు వెళ్లారు.
డచ్ ఆఫ్ స్పిన్నర్ జాచ్ లయన్ కాచెట్ తన ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. నేపాల్ ఆ ఓవర్లో పరుగులు చేయలేకపోయింది. సింగిల్ అవసరం కాగా, ఫస్ట్ బంతికే లెవిట్ భారీ షాట్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. టీ20 ట్రై సిరీస్ టోర్నీలో స్కాట్లాండ్ మూడవ జట్టుగా పోటీపడుతున్నది.
A scorecard that needs to be seen to be believed as The Netherlands and Nepal need THREE Super Overs to separate them 🤯#NEDvNEP 📝: https://t.co/0E9G1sRmm7
📸 @KNCBcricket pic.twitter.com/OInzbhdqgB
— ICC (@ICC) June 17, 2025