చెన్నై: ఐపీఎల్లో జరిమానాల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే లీగ్‌లో బోణీ కోసం ఎదురుచూస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే)తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానే మ్యాచ్ ఫీజులో రూ.12 లక్షల జరిమానా విధిస్తూ ఐపీఎల్ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ నిబంధనలు అనుసరించి ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసిన కారణంగా రహానే ఫైన్ ఎదుర్కొవాల్సి వచ్చింది. బ్యాటర్ల ఘోర వైఫల్యంతో కోల్‌కతా 32 పరుగుల తేడాతో చెన్నై చేతిలో ఓటమిపాలైంది.