న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఫిఫా మహిళల అండర్-17 ప్రపంచకప్ టోర్నీలో వేదికలు దాదాపుగా ఖరారయ్యాయి. అక్టోబర్ 11 నుంచి మొదలవుతున్న మెగాటోర్నీకి గోవా, ఒడిశా, మహారాష్ట్ర ఆతిథ్యమిస్తున్నాయి. మొత్తం 16 జట్లు పోటీపడుతున్న టోర్నీలో 32 మ్యాచ్‌లు జరుగుతాయి. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో భారత్ తమ లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు డీవై పాటిల్, జవహర్లాల్ నెహ్రూ స్టేడియాల్లో జరుగనున్నాయి. సెమీఫైనల్ మ్యాచ్‌లకు గోవా, అక్టోబర్ 30న జరిగే ఫైనల్ పోరు నవీ ముంబైలో ఉంటాయని ఫిఫా, లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ(ఎల్వోసీ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 24న టోర్నీ షెడ్యూల్ అధికారికంగా విడుదల కానుంది.