సింగపూర్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో డ్రాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్(చైనా), దొమ్మరాజు గుకేశ్(భారత్) మధ్య బుధవారం ఎనిమిదో రౌండ్ పోరు ఎలాంటి ఫలితం లేకుండానే డ్రాగా ముగిసింది.
మెగాటోర్నీలో ఈ ఇద్దరి మధ్య ఇది వరుసగా ఐదో డ్రా కావడం విశేషం. ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి ఇద్దరు ప్లేయర్లు ప్రస్తు తం నాలుగేసి పాయింట్లతో సమంగా కొనసాగుతున్నారు. ఇద్దరి మధ్య పోరు 51 ఎత్తుల్లో ముగిసింది.