ఇటీవలే ముగిసిన ఫిడే మహిళల ప్రపంచకప్‌లో కోనేరు హంపిని ఓడించి చాంపియన్‌గా నిలిచిన 19 ఏండ్ల దివ్య దేశ్‌ముఖ్.. గురువారం తన స్వస్థలమైన నాగ్‌పూర్‌కు చేరుకుంది. జార్జియా నుంచి ముంబైకి వచ్చిన ఆమె..
అక్కడ్నుంచి నాగ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకోగానే దివ్య బంధువులు, అభిమానులు పెద్దఎత్తున వచ్చి ఆమెకు స్వాగతం పలికారు. తన విజయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపింది.