Viswanathan Anand : భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand)కు అతిపెద్ద గౌరవం లభించింది. మనదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్ అయిన ఆనంద్ పేరుతో ట్రోఫీని నిర్వహించాలని ఫిడే నిర్ణయించింది. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చెస్ కప్ టోర్నీకి ఆనంద్ పేరు పెట్టింది. చదరంగంలో ఆయన కృషి, సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవం కల్పిస్తున్నట్టు ఫిడే వెల్లడించాడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ గోవాలో ఆరంభ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత చెస్ సమాఖ్య అధ్యక్షుడు నితిన్ నారంగ్ (Nitin Narang) ఫిడే వలర్డ్ చెస్ కప్ పేరు మార్పు నిర్ణయాన్ని ప్రకటించారు.
‘ఫిడే వరల్డ్ చెస్ కప్ టోర్నీని ఇకపై విశ్వనాథన్ కప్ పేరుతో నిర్వహిస్తామనే విషయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్ అయిన ఆనంద్ గౌరవార్థం ఫిడే ఈ నిర్ణయం తీసుకుంది’ అని నారంగ్ పేర్కొన్నారు. అంతేకాదు నెమలి ఆకృతిలోని ట్రోఫీ గురించి కూడా ఆయన మాట్లాడారు. మన జాతీయ పక్షి అయిన నెమలి.. నృత్యం చేస్తున్న భంగిమలో ఉన్నట్టుగా ట్రోఫీని తీర్చిదిద్దాం. పురాతన ఆటలో ఒకటైన చదరంగం వైభవాన్ని ఈ ట్రోఫీ ప్రతిబింబిస్తుంది అని వెల్లడించారు.
Extremely proud and delighted to announce the Viswanathan Anand Cup, the FIDE World Cup (Open) Winner’s Running Trophy, instituted in honour of the King of Chess and India’s first Grandmaster, Shri Viswanathan Anand.
This running trophy stands as an emblem of the great strides… pic.twitter.com/tbUQsbhnvv
— Nitin Narang (@narangnitin) October 31, 2025
గోవా వేదికగా జరుగుతున్న చెస్ వరల్డ్ కప్‌లో 82 దేశాల నుంచి 206 మంది పోటీపడనున్నారు. ఎనిమిది రౌండ్లలో గెలుపొందిన వారు నాకౌట్‌కు అర్హత సాధిస్తారు. అయితే.. ఆనావాయితీ ప్రకారం టాప్ -50లో ఉన్న క్రీడాకారులు నేరుగా రెండో రౌండ్ ఆడుతారు. ప్రతి రౌండ్లో రెండు ఫార్మాట్లలో గేమ్ నిర్వహింనున్నారు. స్కోర్లు సమం అయినప్పుడు టై బ్రేకర్స్ ఆడిస్తారు. విజేతకు రూ.17 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.
ఈ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన వాళ్లు వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించే అవకాశముంది. సో.. గ్రాండ్‌మాస్టర్లంతా తమ మాస్టర్ గేమ్‌తో చెలరేగిపోయేందుకు సిద్దమవుతున్నారు. చివరగా 2002లో మనదేశంలో ఈ వరల్డ్ కప్ జరిగింది. ఆ ఏడాది హైదరాబాద్ వేదికగా సాగిన టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand) టైటిల్ గెలుపొందాడు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకూ చెస్ వరల్డ్ కప్ పోటీలు జరుగనున్నాయి.