ముంబై: టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియాను ఎంపిక జరిగినా దానిపై ఎవరూ పెద్దగా చర్చించుకోవడం లేదు. అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది మరి బీసీసీఐ. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ( MS Dhoni )ని టీమ్‌కు మెంటార్‌గా నియమించి అతని అభిమానులను ఆనందాశ్చర్యాలలో ముంచెత్తింది. తమ ఆరాధ్య క్రికెటర్ బ్లూ జెర్సీలో కనిపించకపోయినా.. కనీసం ఇలా మెన్ ఇన్ బ్లూ వెనుకుండి నడిపిస్తుండటం ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కొత్త రోల్‌ను ఎమ్మెస్ ఎలా పోషిస్తాడో అని ఫ్యాన్సే కాదు.. మొత్తం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది.
బుధవారం రాత్రి ధోనీని మెంటార్‌గా నియమించారని తెలియగానే ట్విటర్ వేదికగా మీమ్స్‌తో చెలరేగిపోయారు అభిమానులు. మహేంద్ర సింగ్ ధోనీని మెంటార్ సింగ్ ధోనీ అని ఓ అభిమాని అభివర్ణించడం విశేషం. వచ్చే వరల్డ్‌కప్‌లో ధోనీ, కోహ్లి ఇలా ఉండబోతున్నారంటూ బాహుబలి 2లో రానా, ప్రభాస్ ఫొటోను మరో వ్యక్తి షేర్ చేశాడు. మరొకరైతే ఫేమస్ హాలీవుడ్ మూవీస్‌లో థోర్, అవెంజర్స్ ఎంట్రీతో టీమిండియాలో మెంటార్‌గా ధోనీ ఎంట్రీని పోల్చారు. టీమిండియాకు గుడ్‌బై చెప్పిన కొన్నాళ్లలోనే మళ్లీ ధోనీ డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
MS Dhoni after making a surprise entry into the Indian dressing room for #t20worldcup2021 😄 pic.twitter.com/xhJtxqes7m
— Wasim Jaffer (@WasimJaffer14) September 8, 2021
When I see MS Dhoni's name as a mentor for #T20WorldCup pic.twitter.com/RhV92WbY3u
— Rajabets India🇮🇳👑 (@smileandraja) September 8, 2021
Ms dhoni in this world cup: pic.twitter.com/nwqLByhYES
— rozgar_CA 🇮🇳 (@Memeswalaladka) September 8, 2021
Kohli and dhoni in upcoming T20 world cup. pic.twitter.com/4VqpspL9Wf
— Mask (@lolwa_op) September 8, 2021