Catch Of The Year : క్రికెట్ మైదానంలో ఫీల్డర్లు నమ్మశక్యంకాని క్యాచ్‌లు పట్టడం చూస్తుంటాం. బౌండరీ లైన్ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకోవడం.. పరుగెడుతూ డైవింగ్ చేస్తూ క్యాచ్ పూర్తి చేయడం వంటివి భలేగా కిక్ ఇస్తాయి. కొన్నేమో క్యాచ్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో చేరిపోయి. అయితే.. అప్పుడప్పుడూ స్టేడియంలోని అభిమానులు కూడా అద్భుతంగా క్యాచ్ పట్టి సంబురాలు చేసుకుంటుంటారు. తాజాగా ఒకతను మాత్రం స్టన్నింగ్ క్యాచ్‌తో అందర్నీ అబ్బురపరిచాడు. ఒకచేతిలో రెండు వోడ్కా బాటిళ్లు(Vodka Bottles) పట్టుకొని.. మరో చేత్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడీ ఫ్యాన్.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ సమయంలో టిమ్ డేవిడ్(Tim David) కొట్టిన బంతిడీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్టాండ్స్‌లోకి వెళ్లింది. బౌండరీ లైన్ వెనకాలే ఉన్న ఒక అభిమాని బంతి తమవైపే రావడం గమినంచాడు. వెంటనే.. తన చేతిలోని రెండు వోడ్కా బాటిళ్లను కుడి చేతిలోకి తీసుకుని.. ఎడమ చేత్తో బంతిని అందుకున్నాడు.
CALLING IT – BEST CROWD CATCH OF THE YEAR AND IT’S ONLY AUGUST!
Two cans in one hand, Kookaburra in the other. #AUSvSA pic.twitter.com/OHGSlI2y2w
— cricket.com.au (@cricketcomau) August 10, 2025
ఆ తర్వాత నేను క్యాచ్ పట్టానోచ్ అంటూ బంతిని అందరికీ చూపిస్తూ మురిసిపోయాడు సదరు అభిమాని. చుట్టుపక్కల ఉన్న ఫ్యాన్స్ కూడా ‘వాట్ ఏ క్యాచ్’ అని అతడిని అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. వీడియో చూసినవాళ్లంతా ఇది నిజంగా క్యాచ్ ఆఫ్ ది ఇయర్ అని కామెంట్లు పెడుతున్నారు పలువురు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో టిమ్ డేవిడ్(83) ఎనిమిది సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో, ఆసీస్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది.