ఢిల్లీ : గత రెండు సీజన్లలో ఆర్సీబీకి సారథిగా వ్యవహరించిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. త్వరలో మొదలుకాబోయే ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ సీజన్‌కు బెంగళూరు అతడిని రిటైన్ చేసుకోకపోవడంతో వేలానికి వెళ్లిన డుప్లెసిస్‌ను ఢిల్లీ రూ.2 కోట్లతో దక్కించుకుంది. ఢిల్లీ ఇది వరకే తమ సారథిగా అక్షర్ పటేల్‌ను నియమించిన విషయం తెలిసిందే. అంతగా కెప్టెన్సీ అనుభవం లేని అక్షర్‌కు డుప్లెసిస్ వంటి అనుభవజ్ఞుడు అండగా ఉండటం జట్టుకు మేలు చేస్తుందని క్యాపిటల్స్ మేనేజ్మెంట్ భావిస్తోంది.