EURO 2024 : జర్మనీ ఆతిథ్యమిస్తున్న సాకర్ పండుగ యూరో చాంపియన్‌షిప్(EURO 2024)లో గోల్స్ వర్షం కురుస్తోంది. టోర్నీ ఆరంభమైన రెండు రోజులకే రికార్డు స్థాయిలో బంతి గోల్ పోస్టులోకి దూసుకెళ్లింది. నాలుగు మ్యాచుల్లోనే ఏకంగా 16 గోల్స్ నమోదయ్యాయి. దాంతో, మెగా టోర్నీ 48 ఏండ్ల చరిత్రలో అత్యధిక గోల్స్ రికార్డు కావడం ఇదే తొలిసారి. 1976 యూరో చాంపియన్‌షిప్స్ తర్వాత తొలి నాలుగు మ్యాచుల్లోనే ఆటగాళ్లు డజన్నర గోల్స్ కొట్టేయడం ఓ పెద్ద సంచలనమే.
యూరో చాంపియన్‌షిప్ టోర్నీ ఆరంభ పోరులోనే జర్మనీ 5 గోల్స్ కొట్టింది. ప్రత్యర్థి స్కాట్లాండ్ను ఒక్క గోల్‌కే పరిమితం చేసి అదిరే బోణీ కొట్టింది. ఆ తర్వాత స్విట్జర్లాండ్ 3-1తో హంగేరిని చిత్తు చేసింది. ఇక సమఉజ్జీల సమరంగా భావించిన పోరులో స్పెయిన్(Spain) మూడు గోల్స్‌తో క్రొయేషియాను మట్టికరిపించింది.
🇪🇸 Álvaro Morata vs Croatia…
EURO 2016 ⚽️
EURO 2020 ⚽️
EURO 2024 ⚽️#EURO2024 | #ESPCRO pic.twitter.com/tID7xxtkbm— UEFA EURO 2024 (@EURO2024) June 15, 2024
ఈ మెగా టోర్నీలో స్పెయిన్ టీనేజర్ లమినె యమల్ (Lamine Yamal) అరుదైన ఘనత సాధించాడు. యూరో కప్‌లో ఆడిన అతి పిన్నవయస్కుడిగా లమినె రికార్డు సృష్టించాడు. 16 ఏండ్ల 338 రోజుల వయసులో అతడు క్రొయేషియాపై ఆడి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. అంతేకాదు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన చిన్న వయసు ఫుట్‌బాలర్‌గా లమినే గుర్తింపు సాధించాడు.
యూరో చాంపియన్‌షిప్‌లో అల్బేనియా ఆటగాడు మెరుపు గోల్ చేశాడు. టోర్నీ చరిత్రలోనే వేగవంతమైన గోల్‌తో రికార్డు సృష్టించాడు. ఇటలీపై నెడిమ్ బజ్రామి(Nedim Bajrami) కేవలం 23 సెకన్లలోనే బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. కానీ, ఈ మ్యాచ్‌లో ఇటలీ 2-1తో గెలుపొందింది.
The fastest goal in EURO history!
Nedim Bajrami 🇦🇱⚽️#EURO2024
— UEFA EURO 2024 (@EURO2024) June 16, 2024