హైదరాబాద్: ఈ యేటి ఆస్కార్స్ వేడుకల్లో ఇండియన్ ఫిల్మ్ ఆర్ఆర్ఆర్(RRR)లోని నాటు నాటు(Naatu Naatu) పాటకు బెస్ట్ ఓరిజినల్ సాంగ్(best original song) అవార్డు దక్కిన విషయం తెలిసిందే. లాస్ ఏంజిల్స్‌లో ఇవాళ జరిగిన సెర్మనీలో ఆ సాంగ్ కంపోజర్, రైటర్ ఆ అవార్డును అందుకున్నారు. అయితే హాలీవుడ్‌లోనూ ఊపేసిన ఆ ఫేమస్ ట్రాక్‌లో హీరోలుగా ఎన్టీఆర్(Jr NTR), రాంచరణ్(Ramcharan) డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి వేసే ఆ స్టెప్పులు యావత్ ప్రపంచాన్ని ఊపేశాయి. ఇక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే ప్రఖ్యాతి గాంచిన అకాడమీ అవార్డుల్లోనూ ఆ పాట ట్యాన్స్కు అవార్డు దక్కడం అంతలేని సంతోషమే.
అయితే మరోవైపు ఈ ఏడాది జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(WTC) ఫైనల్‌కు ఇవాళ టీమిండియా అర్హత సాధించింది. లంకతో జరిగిన తొలి టెస్టులో కివీస్ నెగ్గడంతో.. ఇండియా ఆ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. అయితే నాటు నాటు సాంగ్‌లో డ్యాన్స్ చేసిన ఇద్దరు హీరోల ఫోటోలను ఇవాళ ఈఎస్పీఎన్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. సినీ హీరోల స్థానంలో క్రికెటర్లు కోహ్లీ(kohli), రోహిత్(rohit) ఫోటోలను పెట్టి ఆ ఫోటోను అప్లోడ్ చేసింది.
Back-to-back WTC finals for India 🕺 🕺 pic.twitter.com/8f7EpVUrpW
— ESPNcricinfo (@ESPNcricinfo) March 13, 2023
ఇండియా వరుసగా రెండో సారి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు కూడా ఆ ఫోటోకు ఈఎస్పీఎన్(espn) క్యాప్షన్ ఇచ్చింది. కోహ్లీ, రోహిత్‌లు తెగ చిందేస్తున్నట్లు ఆ ఫోటోను ఫన్నీగా మార్పింగ్ చేశారు.