ప్రస్తుతం దేశంలో ఏ క్రీడాభిమానినైనా పలకరించి వారి ఇష్టమైన ఆట ఏదని అడిగితే.. వందలో తొంభై శాతం మంది చెప్పే సమాధానం ఒక్కటే!
ఆ ఆట క్రికెట్ అని చెప్పాల్సిన పనిలేదు కదా!!
కానీ ఒకప్పుడు పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. ఇప్పుడంటే స్పాన్సర్లు, ఎండార్స్ మీడియా హక్కులు ఇలా బోలెడంత డబ్బు వచ్చి పడుతుంది కానీ.. నాలుగు దశాబ్దాల క్రితం మాత్రం అసలు ఆ ఆటే మనది కాదని చాలా మంది భావించేవారు.
అలాంటి సమయంలో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ భారత్ అద్భుతం చేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా 1983 వరల్డ్ బరిలోకి దిగిన కపిల్ సేన.. దేశాన్ని హాకీ జోరు నుంచి మళ్లించి క్రికెట్ మత్తులో దింపింది. ఇక అక్కడి నుంచి మొదలైన క్రికెట్ ఫీవర్ చిన్నా పెద్దా తేడా లేకుండా దేశాన్ని ఓ కుటుంబంలా మార్చేసింది. మరో 11 రోజుల్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. దేశ క్రీడా చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఆ టోర్నీ జర్నీని ఓసారి నెమరువేసుకుందాం..
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
అప్పటి వరకు అడపా దడపా విజయాలు తప్ప.. పరిమిత ఓవర్ల క్రికెట్ భారత జట్టు పెద్దగా సాధించిందేమీ లేదు. అంతకుముందు జరిగిన రెండు ప్రపంచకప్ (1975, 1979)లోనూ పాల్గొన్న టీమ్ కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్ర మే నెగ్గింది. 1983 జూన్ 9 నుంచి 25 వరకు జరిగిన ఈ టోర్నీని అసలు మనవాళ్లు సీరియస్ తీసుకోలేదు. ఆ సమయంలో కొత్తగా పళ్లైన భారత ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అయితే.. తన భార్యను హనీమూన్ తీసుకెళ్తున్నానని చెప్పి ఇంగ్లండ్ ఫ్లయిట్ ఎక్కించాడు. ప్రూడెన్షియల్ కప్ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీ ఆరంభం కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కపిల్ వచ్చిరాని ఇంగ్లిష్ ట్రోఫీ గెలిచేందుకే ఇక్కడి వచ్చామని చెప్తే.. అక్కడున్న వాళ్లంతా ఘొల్లున నవ్వారు.
కానీ నవ్విన నాప చేనే పండుతుంది అన్న చందంగా.. ఎనిమిది జట్లు పాల్గొన్న టోర్నీలో లీగ్ దశలో ఆడిన తొలి మ్యాచ్ రెండుసార్లు ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ మట్టికరిపించిన భారత్ ఆ తర్వాత జింబాబ్వేపై రెండుసార్లు, ఆస్ట్రేలియాపై ఒకసారి నెగ్గి సెమీస్ దూసుకెళ్లింది. బ్యాటింగ్ గవాస్కర్, శ్రీకాంత్, మొహిందర్ అమర్ కపిల్ సందీప్ పాటిల్, యష్ శర్మ రాణిస్తే.. బౌలింగ్ రోజర్ బిన్ని, మదన్ బల్విందర్ సంధు ఇలా ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. ఇక సెమీఫైనల్లో ఇంగ్లండ్ మట్టికరిపించిన కపిల్ డెవిల్స్.. ఫైనల్లో విండీస్ మెడలు వంచి జగజ్జేతగా అవతరించింది. ఆ అపురూప ఘట్టం గురించి ఎంత చెప్పుకున్న వొడవని ముచ్చటే!