నాటింగ్‌హామ్(ఇంగ్లండ్): జింబాబ్వేతో ఏకైక టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 30/2తో శనివారం ఫాలోఆన్‌కు దిగిన జింబాబ్వే..యువ స్పిన్నర్ షోయబ్ బషీర్(6/81) ధాటికి 255 పరుగులకు ఆలౌటైంది.
మిడిలార్డర్లో సీన్ విలియమ్స్(88), సికిందర్ రజా(60) అర్ధసెంచరీలతో పోరాడారు. ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని సమర్థంగా నిలువరిస్తూ వీరిద్దరు సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు.