లార్డ్స్: ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయానికి కావలసిన పరుగులను కేవలం నాలుగు బంతుల్లోనే సాధించి ఇంగ్లండ్ విజయనాదం చేసింది.
ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోడానికి రెండో ఇన్నింగ్స్‌లో 352 పరుగులు చేయాల్సిన ఐర్లాండ్ 362 పరుగులకు ఆలౌటయింది. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో విజయానికి అవసరమైన 11 పరుగులను ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే తొలి ఓవర్ మొదటి, మూడు, నాలుగు బంతులను బౌండరీలకు తరలించి విజయాన్ని ఖాయం చేశాడు. గత 13 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కిది 11వ విజయం.