ENGW vs BANW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో పెద్ద సంచలనం తప్పింది. తొలి పోరు స్కాట్లాండ్పై విజయంతో బోణీ కొట్టిన బంగ్లాదేశ్ రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించినంత పని చేసింది. అయితే.. మిడిల్ ఓవర్లలో ఒత్తిడికి తలొగ్గి చేజేతులా ఓడింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించినంది. ఫీల్డింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ 21 పరుగుల తేడాతో గెలుపొంది వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది.
కొట్టింది తక్కువ స్కోరే అయిన బౌలింగ్‌లో ఇంగ్లండ్ అద్భుతం చేసింది. నలుగురు స్పిన్నర్లతో ఆడిన హీటర్ నైట్ బృందం బంగ్లా నుంచి విజయాన్ని లాగేసుకుంది. స్వల్ప ఛేదనలో శోభన మొస్ట్రే(44), కెప్టెన్ నిగర్ సుల్తానా(15)లు అద్భుతంగా ఆడారు. అయితే.. ఇంగ్లండ్ స్పిన్నర్లు లిన్సే స్మిత్(211), చార్లొట్టె డీన్(222)లు వరుస విరామాల్లో వికెట్లు తీసి బంగ్లాను ఒత్తిడిలో పడేశారు. సుల్తానా ఔటయ్యాక ఓ ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. దాంతో, గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
England start with a W 🏴
SCORECARD: https://t.co/axBSfEMZNU | #T20WorldCup pic.twitter.com/K7GYfAuKTT
— ESPNcricinfo (@ESPNcricinfo) October 5, 2024
మొదట ఆడిన ఇంగ్లండ్ 118 పరుగులే చేసింది. వరర్డ్ క్లాస్ బ్యాటర్లో కూడిన ఇంగ్లీష్ టీమ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. బంతి టర్న్ కావడంతో రెచ్చిపోయిన స్పిన్నర్లు నహిదా అక్తర్(232), ఫహిమా ఖాతూన్(218)లు వరుస వికెట్లతో వణుకు పుట్టించారు. ఈ ఇద్దరి ధాటికి సహచర అమ్మాయిలంతా డగౌట్ చేరుతుంటే ఓపెనర్ డానియల్ వ్యాట్(43) మాత్రం ఒంటరి పోరాటం చేసింది. ఆఖర్లో వికెట్ కీపర్ అమీ జోన్స్() ధనాధన్ ఆడడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.