ఆస్ట్రేలియా నిర్ధేశించిన అతి తక్కువ లక్ష్యాన్ని ఇంగ్లండ్ సింపుల్‌గా ఛేదించేసింది. 11.4 ఓవర్లలోనే ఇంకా 50 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను జోస్ బట్లర్ అలవోకగా గెలిపించాడు. 32 బంతుల్లో 71 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రాయ్ 20 బంతుల్లో 22 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మలాన్ 8 బంతుల్లో 8 పరుగులు చేయగా బైర్‌స్టో 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు.
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ బరిలోకి దిగింది. 20 ఓవర్లలో అన్ని వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి.. ఇంగ్లండ్‌కు తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు వేసి ఒక వికెట్ తీసి 37 పరుగులు అందించాడు. అస్టోన్ అగర్ 2.4 ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.
4 ఓవర్లు వేసి 3 కీలక వికెట్లు తీయడంతో పాటు.. ఆస్ట్రేలియాకు అతి తక్కువ పరుగులు 17 అందించిన క్రిస్ జోర్డాన్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
The England juggernaut rolls on 🚂#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/CorHrie1TW
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
A blazing half-century from Jos Buttler 💥#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/HAhNPcQ9sY
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021