లండన్: ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడవద్దు అని ఇంగ్లండ్ రాజకీయవేత్తలు(UK Politicians) తీర్మానించారు. సుమారు 160 మంది నేతలు ఓ లేఖపై సంతకం చేశారు. మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ ప్రభుత్వ ఆగడాలను అడ్డుకునేందుకు ఈ చర్య తీసుకోవాలని రాజకీయవేత్తలు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును కోరారు. దీనిలో భాగంగానే ఫిబ్రవరి 26వ తేదీన లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని కోరారు. 2021లో తాలిబన్లు అధికారం దక్కించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోయిందని, ఐసీసీ రూల్స్‌కు తగినట్లు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ఉండడం లేదన్నారు. పురుషుల క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న నేపథ్యంలో.. ఆ మ్యాచ్‌ను బహిష్కరించాలని యూకే పార్లమెంట్లో తీర్మానించారు. లేబర్ పార్టీ ఎంపీ టోనియా ఆంటోనియాజ్ రాసిన లేఖపై మిగితా ఎంపీలు సంతకం చేశారు. ఈసీబీ చీఫ్ రిచర్డ్ గౌల్డ్కు ఆ లేఖను పంపారు.