లార్డ్స్ : భారత్‌తో జరుగుతున్న మూడవ టెస్టు(ENGvIND)లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నది. భారత జట్టులోకి మళ్లీ బుమ్రా వచ్చేశాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ టెస్టును ఇంగ్లండ్ గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అయిదు టెస్టుల సిరీస్‌లో 1-1 సమంతో ఉన్నాయి. ప్రసిద్ధకృష్ణ స్థానంలో బుమ్రాను తీసుకున్నారు. వరుసగా మూడోసారి బెన్ స్టోక్స్ టాస్ గెలిచాడు. టెస్టు సిరీస్ ఆసక్తికరంగా మారిందని, లార్డ్స్‌లో గెలిచి సిరీస్ లో 2-1 ఆధిక్యాన్ని సాధించాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఇంగ్లండ్ జట్టు ఒక మార్పు చేసింది. ఆ జట్టులోకి ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ వచ్చాడు. నాలుగేళ్ల తర్వాత అతను టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. జోష్ టాంగ్ స్థానంలో అతన్ని తీసుకున్నారు.
🚨 Toss and Team Update 🚨
England win the toss and elect to bat in the 3rd Test.
Jasprit Bumrah is back in the eleven 🙌
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#TeamIndia | #ENGvIND pic.twitter.com/uulWRWPOaU
— BCCI (@BCCI) July 10, 2025