Pakistan vs England | రావల్పిండి: పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ ఇబ్బందుల్లో పడింది. పాక్ స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ..ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఇంగ్లండ్ 53 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది.
రూట్(5), బ్రూక్(3) క్రీజులో ఉన్నారు. నోమన్ అలీ(2/9), సాజిద్‌ఖాన్(1/14) రాణించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 73/3తో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన పాక్ 344 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (134) సెంచరీతో విజృంభించగా, అలీ(45), సాజిద్‌ఖాన్ (48 నాటౌట్) ఆకట్టుకున్నారు. రేహాన్ అహ్మద్(4/66), బషీర్ (3/129) పాక్ పతనంలో కీలకమయ్యారు.