సౌతాంప్టన్(ఇంగ్లండ్): సుదీర్ఘ వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ రికార్డు విజయాన్నందుకుంది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ ఏకంగా 342 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై చారిత్రక విజయం సాధించింది. తొలుత ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 414/5 భారీ స్కోరు చేసింది. రూట్ జాకబ్ బెతెల్ సెంచరీలతో విజృంభించారు. స్మిత్ బట్లర్(62 నాటౌట్) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. బాశ్, మహారాజ్ రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో ఆర్చర్ ధాటికి సఫారీలు 20.5 ఓవర్లలో 72 పరుగులకు కుప్పకూలింది. బాశ్(20) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు.