క్రికెట్ ఆడుతూ అవుటైనందుకు ఒక ప్లేయర్ ఏడ్చేసింది. ఈ ఘటన భారత్, ఇంగ్లండ్ మహిళలు ఆడిన మూడో వన్డేలో వెలుగు చూసింది. అప్పటికే వరుసగా రెండు వన్డేల్లో ఓడిన ఇంగ్లండ్ జట్టు.. మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావించింది. లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ క్రీడాకారిణి షార్లెట్ డీన్‌ను భారత బౌలర్ దీప్తి శర్మ ‘మన్కడ్’ అవుట్ చేసింది.
ఆమె బాల్ వేయకముందే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న డీన్ క్రీజును దాటేసింది. దీంతో వెనక్కు తిరిగిన ఆమె వికెట్లను కూల్చింది. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును కాపాడేందుకు డీన్ కష్టపడుతోంది. ఇలాంటి సమయంలో దీప్తి ఆమెను మన్కడ్ అవుట్ చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన డీన్ ఏడ్చేసింది. ఐసీసీ రూల్ బుక్‌లో ఇటీవలే మన్కడింగ్‌ను ‘రనౌట్’గా చేర్చిన సంగతి తెలిసిందే.
Here's what transpired #INDvsENG #JhulanGoswami pic.twitter.com/PtYymkvr29
— 𝗔𝗱𝗶𝘁𝘆𝗮 (@StarkAditya_) September 24, 2022
What’s your take on this?
A: What Deepti did was spot on!
B: Hey mate, where is the spirit of the game?
C: Stay within the laws (crease) or get OUT!
Comment below!#ENGvIND | #DeeptiSharma | #ThankYouJhulan pic.twitter.com/CjWxr0xkiz
— Women’s CricZone (@WomensCricZone) September 24, 2022