Ashes Series : యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో రోజు ఆసక్తికర సంఘటన జరిగింది. స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) హ్యాట్రిక్ (hat-trick)పై నిలిచాడు. దాంతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) వికెట్ కోసం స్టీవ్ స్మిత్(Steve Smith) చుట్టూ ఏకంగా ఎనిమిది మంది ఫీల్డర్లను మోహరించాడు. స్లిప్‌లో ఇద్దరూ, గల్లీలో మరో ఇద్దరు, లెగ్ స్లిప్‌లో ఇద్దరు, మిడ్ వికెట్లో ఒకరిని పెట్టాడు. అయితే.. స్మిత్ మాత్రం స్టోక్స్ పాచిక పారనివ్వలేదు. ఆ బంతిని ఆడకుండా వదిలేశాడు. దాంతో, ఇంగ్లండ్ కెప్టెన్‌తో పాటు ఆటగాళ్లు ఉసూరుమంటూ నిట్టూర్చారు. స్టోక్స్ ఫీల్డింగ్ పొజిషన్ ఫొటో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
రెండో రోజు ఆస్ట్రేలియా ఓవర్‌నైట్ స్కోర్ 14తో ఇన్నింగ్స్ ఆరంభించింది. తొలి సెషన్లోనే చెలరేగిన స్టువార్ట్ బ్రాడ్ వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు తీశాడు. డేవిడ్ వార్నర్(9)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికే మార్నస్ లబూషేన్(0)ను గోల్డెన్ డక్(Golden Duck)గా వెనక్కి పంపాడు. దాంతో, బ్రాడ్ హ్యాట్రిక్‌పై నిలిచాడు. క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసేందుకు స్టోక్స్ మొత్తం ఫీల్డర్లను అతడి చుట్టూ మోహరించాడు.
Four slips and two leg-slips for Steve Smith
What is captain Ben Stokes cooking?
📸: Sony Liv#CricTracker #SteveSmith #BenStokes pic.twitter.com/ve3YbyaHnl
— CricTracker (@Cricketracker) June 17, 2023
కానీ, స్మిత్ హ్యాట్రిక్ బంతిని వదిలేసి ఊపిరి పీల్చుకున్నాడు. అయితే.. ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మిస్తున్న స్మిత్‌ను స్టోక్స్ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లేర్ చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్(118 నాటౌట్) సెంచరీ, జానీ బెయిర్‌స్టో(78) అర్ధ శతకంతో రాణించారు.