Lionel Messi | బార్సిలోనాకు ఆడాలనుకున్నా.. కానీ, నా నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నా : మెస్సీ
Lionel Messi : ఫుట్‌బాల్ ఐకాన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వచ్చే సీజన్లో కొత్త క్లబ్‌కు ఆడనున్న విషయం తెలిసిందే. వచ్చే సీజన్లో ఈ ఫార్వర్డ్ ప్లేయర్ మేజర్ లీగ్ సాకర్(Major League Soccer)లో ఆడనున్నాడు. కొత్త క్లబ్‌కు మారడంపై ఈ స్టార్ ప్లేయర్ తాజాగా స్పందించాడు. అర్జెంటీనా టీవీ పబ్లికా(TV Publica)తో మాట్లాడిన...
Lionel Messi : ఫుట్‌బాల్ ఐకాన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వచ్చే సీజన్లో కొత్త క్లబ్‌కు ఆడనున్న విషయం తెలిసిందే. స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా(Barcelona), సౌదీ అరేబియా క్లబ్ అల్ – హిలాల్(Al Hilal ) క్లబ్స్ ఈ దిగ్గజ ఆటగాడితో ఒప్పందం కోసం ప్రయత్నించాయి. కానీ, మెస్సీ మాత్రం అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు ఓటేశాడు. వచ్చే సీజన్లో ఈ ఫార్వర్డ్ ప్లేయర్ మేజర్ లీగ్ సాకర్(Major League Soccer)లో ఆడనున్నాడు. కొత్త క్లబ్‌కు మారడంపై ఈ స్టార్ ప్లేయర్ తాజాగా స్పందించాడు.
అర్జెంటీనా టీవీ పబ్లికా(TV Publica) తో మాట్లాడిన మెస్సీ… ‘ఇంటర్ మియామి క్లబ్‌కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నానని అన్నాడు. ‘పీఎస్జీ()తో రెండేళ్ల కాంట్రాక్టు ముగింపు సమయంలో నా ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మొదట్లో నేను, నా టీమ్ బార్సిలోనాకు వెళ్లాలని అనకున్నాం. కానీ, మియాబి క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం అనేది మేము వేసిన కీలకమైన అడుగు. నేను ఏం చేస్తున్నాను? అనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంది’ అని మెస్సీ వెల్లడించాడు.

రెండు నిమిషాల్లోనే గోల్
జూన్ 30వ తేదీన పీఎస్జీ క్లబ్ తరఫున మెస్సీ ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ప్రస్తుతం అతను చైనాలో ఆస్ట్రేలియా(Australia)తో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. బీజింగ్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఈ లెజెండరీ ఆటగాడు మెరిశాడు. ఆట ఆరంభమైన రెండు నిమిషాల్లోనే గోల్ కొట్టి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. దాంతో, అర్జెంటీనా 2-0తో ఆస్ట్రేలియాను ఓడించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న మెస్సీ గత ఏడాది తమ జట్టుకు వరల్డ్ కప్(FIFA World Cup) అందించాడు. రెండోసారి అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చిన అతను తన వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. ఫ్రాన్స్‌తో జరిగిన టైటిల్ పోరులో మెస్సీ రెండు గోల్స్ కొట్టాడు. ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్‌తో హడలెత్తించినా చివరకు షూటౌట్లో 4-2తో అర్జెంటీనా గెలుపొందింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

