Ben Stokes : ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) లార్డ్స్ టెస్టు(Lords Test)లో పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. వీరోచిత సెంచరీ(155 : 214 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) బాదిన అతను ఇంగ్లండ్ గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు(Most Sixes) కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ లెఫ్డ్ హ్యాండర్ ఏకంగా 9 సిక్స్‌లు బాదాడు. అంతకుముందు 8 సిక్స్‌లతో తాను నెలకొల్పిన రికార్డును ఈ రోజు బ్రేక్ చేశాడు. 2019లో లీడ్స్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై స్టోక్స్ 8 సిక్స్‌లు కొట్టాడు.
అంతేకాదు లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల బాదిన క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron Green) ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ చితక్కొట్టాడు. మూడు సిక్స్‌లు, ఒక ఫోర్, 1 సింగిల్‌తో కలిపి 23 పరుగులు పిండుకున్నాడు.
You are something else, Stokesy 🙌💯 @IGcom | #Ashes pic.twitter.com/JCwJUKYkGJ
— England Cricket (@englandcricket) July 2, 2023
అయితే.. జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. విధ్వసంక బ్యాటింగ్ చేస్తున్న అతడిని జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) ఔట్ చేశాడు. కీపర్ అలెక్స్ క్యారీ సూపర్ క్యాచ్ పట్టడంతో స్టోక్స్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అక్కడితే ఆసీస్ విజయం ఖాయమైంది.
లార్డ్స్‌లో మెరుపు శతకం బాదిన స్టోక్స్(155)
యాషెస్(Ashes) రెండో టెస్టులో ఇంగ్లండ్ చిత్తుగా ఓడిపోయింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పర్యాటక ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో అతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(155) వీరోచిత సెంచరీతో భయపెట్టినా ఆఖరికి ఆసీస్‌దే పై చేయి అయింది. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ తలా మూడేసి వికెట్లతో రాణించారు. వరుసగా రెండో విజయంతో ప్యాట్ కమిన్స్ సేన 5 టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కీలకమైన మూడో టెస్టు లీడ్స్(Leeds) వేదికగా జూలై 6 నుంచి జరగనుంది.