IND vs ENG T20 series : భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ (T20 మ్యాచ్) లో భారత బౌలర్లు తమ సత్తా చాటుతున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లను వరుసగా పెవిలియన్ బాట పట్టిస్తున్నారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ (India captain) సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇంగ్లండ్‌ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. బరిలోకి వచ్చిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్ల దాటికి తాళలేక వెంటవెంటనే ఔటైపోతున్నారు.
తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ డౌకౌట్ అయ్యాడు. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ జోస్ బట్లర్ మరో ఓపెనర్ బెన్ డకెట్‌కు జతగా క్రీజులోకి వచ్చాడు. కానీ మూడో ఓవర్ ఐదో బంతికి బెన్ డకెట్ (4) కూడా పెవిలియన్‌కు చేరాడు. అర్షదీప్ బౌలింగ్‌లోనే రింకూసింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం మరో బౌలర్ వరుణ్ చక్రవర్తి తన విశ్వరూపం చూపించాడు.
ఎనిమిదో ఓవర్ మూడో బంతికి హ్యారీ బ్రూక్‌ను, ఐదో బంతికి లియామ్ లివింగ్‌స్టోన్‌ను ఔట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి ఇంగ్లడ్ స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 65 పరుగులు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 10 ఓవర్ల ఆట ముగిసే సమయానికి బట్లర్ 29 బంతులను ఎదుర్కొని 47 పరుగులు చేశాడు. అప్పటికి టీమ్ స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులుగా ఉంది.
IND vs ENG | ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్