దోహా: ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా భావిస్తున్న ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో ఇరాన్‌ను చిత్తుగా ఓడించింది. సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-2 తేడాతో ఇరాన్‌పై ఘన విజయం సాధించింది. ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన మాజీ చాంపియన్ ఇంగ్లండ్ తరఫున బెల్లింగ్‌హామ్ (35ని), బుకాయో సాకా (43ని, 62ని), రహీమ్ స్టిర్లింగ్(45ని), మార్కస్ రాష్‌ఫోర్డ్(71ని), జాక్ గ్రిలీశ్(89ని) గోల్స్ చేశారు. మరోవైపు మోహదీ తరెమీ (65ని, 90+13ని) ఇరాన్ జట్టుకు రెండు గోల్స్ అందించాడు. యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో నిరాశపరిచిన బుకాయో సాకా ఈ మ్యాచ్‌లో అదరగొట్టాడు. మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2-0తో సెనెగల్పై విజయం సాధించింది. క్యాడీ(84ని), క్లాసెన్ (90+9ని) నెదర్లాండ్స్‌కు గోల్స్ అందించారు.