New Zealand Vs England | క్రిస్ట్‌చర్చ్ : న్యూజిలాండ్‌తో క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు.. 12.4 ఓవర్లలోనే దంచేసింది. జాకబ్ బెతెల్ (50 నాటౌట్), బెన్ డకెట్ (27), జో రూట్ (23 నాటౌట్) ధాటిగా ఆడి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ టెస్టులో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించిన ఇంగ్లండ్ ఆటగాడు బ్రైడన్ కార్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.