ODI World Cup | వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయినా.. ఆఫ్ఘన్ బౌలర్లను తట్టుకుని బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ 13వ ఓవర్ లో మహమ్మద్ నబీ వేసిన బంతిని షార్ట్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా ఇబ్రహీం జాడ్రన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జాస్ బట్లర్ సింగిల్ తీశాడు. 14వ ఓవర్ మెయిడెన్ గా నిలిచిపోయింది. 15వ ఓవర్ లో మహ్మద్ నబీ వేసిన తొలి బంతికి హరి బ్రూక్ సింగిల్, జాస్ బట్లర్ రెండు పరుగులు తీశాడు. దీంతో ఇంగ్లండ్ 15 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.
పదో ఓవర్లో ఫజల్హక్ ఫరూఖీ వేసిన మూడో బంతిని హరీ బ్రూక్ బౌండరీకి మళ్లించాడు. చివరి బంతికి రెండు పరుగులు సాధించడంతో పదో ఓవర్ లో మొత్తం ఆరు పరుగులు లభించాయి. అంతకుముందు ఏడు ఓవర్లలోపే 33 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జానీ బరిష్టా.. ఫజలాఖ్ ఫరూఖీ బౌలింగ్లో రెండో ఓవర్ తొలి బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. జానీ బరిష్టా స్థానం వన్ డౌన్గా వచ్చిన జాయ్ రూట్.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్ బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 33 పరుగులు మాత్రమే. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 49.5 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 80, ఇబ్రహీం జాడ్రన్ 28, ఇక్రం అలిఖిల్ 58, ముజీం ఉర్ రెహ్మాన్ 28 పరుగులు చేశారు.