IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో రెండో విజయంతో మురిసిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు గుడ్‌న్యూస్. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో మ్యాచ్‌కు ముందే ఆ జట్టుకు మరింత బలాన్నిచ్చే ఆల్‌రౌండర్ వచ్చేశాడు. టోర్నీ ఆరంభ నుంచి జట్టుతో కలవని విల్ జాక్స్ (Will Jacks) మంగళవారం భారత్‌లో అడుగుపెట్టాడు. వస్తూ వస్తూనే స్క్వాడ్‌లో కలిసిన ఈ విధ్వంసక హిట్టర్ సహచరులతో కలిసి ప్రాక్టీస్ మొదలెట్టాడు.
ఐపీఎల్-19లో రెండే విజయాలతో ప్లే ఆఫ్స్‌లో వెనకబడిన ముంబై ఇండియన్స్ ఆట ఇకపై అదరనుంది. మిడిలార్డర్ బ్యాటింగ్ కష్టాలను దూరం చేసేందుకు విల్ జాక్స్ సిద్ధమవుతున్నాడు. ఇటీవలే భారత్, శ్రీలంక ఆతిథ్యమిచ్చిన పొట్టి ప్రపంచకప్‌లో వికెట్ల(8 మ్యాచుల్లో 9 వికెట్లు) వేటతో రెచ్చిపోయిన జాక్స్ మంగళవారం ముంబై స్క్వాడ్‌లో కలిశాడు.
🚨JUST IN
Will Jacks has joined the Mumbai Indians camp and is practicing ahead of the #MIvCSK clash pic.twitter.com/C5zvvQi4i1
— Cricbuzz (@cricbuzz) April 21, 2026
అటు బ్యాటుతో, ఇటు బంతితో ప్రత్యర్ధిని భయపెట్టగల జాక్స్ రాకతో ముంబై మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే శాంట్నర్, గజన్ఫర్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉండగా.. జాక్స్ ఎంట్రీతో ముంబై స్పిన్ దళం మరింత దుర్బేధ్యంగా మారనుంది.
Axar Patel’s stunning effort and Shivam Dube’s able support puts an end to Will Jacks’ attack 👊#T20WorldCup broadcast details 👉 https://t.co/NPykWM7qqY pic.twitter.com/U83ZnQJTZt
— ICC (@ICC) March 5, 2026
ప్రపంచకప్‌లో తిప్పేసిన జాక్స్ నాలుగు మ్యాచుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుపొందిన ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఈసారి ముంబై విజయాల్లో భాగం కానున్నాడు. గత మ్యాచ్‌లో తిలక్ వర్మ(101 నాటౌట్) సూపర్ సెంచరీతో గుజరాత్‌ను చిత్తు చేసిన ముంబై వాంఖడేలో బుధవారం సీఎస్కేతో తలపడనుంది.