Oval Test : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డు మైదానంలో భారత మిడిలార్డర్ అసమాన పోరాటంతో సిరీస్ పట్టేసే అవకాశం చేజార్చుకుంది స్టోక్స్ బృందం. ఊహించని డ్రాతో షాక్‌కు గురైన ఇంగ్లండ్ (England) వ్యూహం మార్చాలనుకుంటోంది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో ఆఖరిదైన ఐదో టెస్టు కోసం ఆతిథ్య జట్టు ఆరో పేసర్‌ను తీసుకుంది. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడే జేమీ ఓవర్టన్ (Jamie Overton)ను స్క్వాడ్‌లోకి చేర్చుకుంది.
ఇప్పటికే ఇంగ్లండ్ పేస్ దళంలోని అట్కిన్సన్, జోష టంగ్ బెంచ్ మీద ఉండగా.. ఓవల్ మ్యాచ్‌లో ఎవరిని పక్కన పెడతారనేది తెలియాల్సి ఉంది. బ్యాటుతో కీలక రన్స్ చేసే కార్సేను తప్పించే సాహసం ఇంగ్లండ్ చేయకపోవచ్చు. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసిన ఆర్చర్, మోకాలి గాయం నుంచికోలుకుని అద్భుతంగా రాణిస్తున్న వోక్స్ తుది జట్టులో ఉండే అవకాశముంది. బౌలింగ్ పిచ్ అయితే.. నలుగురు పేసర్లతో ఆడితే ఓవర్టన్కు అవకాశం దక్కే వీలుంది. ఎందుకంటే స్టోక్స్ ఐదో రోజు ఇబ్బంది పడుతూనే బౌలింగ్ చేశాడు. కాబట్టి ఓవల్‌లో ఓవర్టన్ తుది జట్టులో ఉండడం ఖాయమనిపిస్తోంది.
JUST IN: England add Jamie Overton to their squad for the fifth Test against India at The Oval 🏴 pic.twitter.com/uc2A3Qxr5o
— ESPNcricinfo (@ESPNcricinfo) July 28, 2025
ఇంగ్లండ్ స్క్వాడ్ : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), జోష్ టంగ్ క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్.
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను 358కే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. అనంతరం 311 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక మ్యాచ్ మనదే అని ఉత్సాహంతో గిల్ సేనను ఆలౌట్ చేయాలనుకున్న ఇంగ్లండ్ బౌలర్ల ఎత్తులు ఫలించలేదు. నలుగురంటే నలుగురే ఐదు సెషన్లు క్రీజలో నిలిచి స్టోక్స్ సేనుకు ముచ్చెమటలు పట్టించి చిరస్మరణీయ డ్రాతో జట్టును గట్టెక్కించారు.
నాలుగో రోజు ఆఖరి సెషన్ నుంచి.. ఐదో రోజు తొలి సెషన్లో కాసేపటి వరకూ శుభ్‌మన్ గిల్(103), కేఎల్ రాహుల్(90)లు అద్భుత పోరాంటతో ఆశలు రేపారు. లంచ్ లోపే ఈ ఇద్దరూ ఔటైనా.. రవీంద్ర జడేజా(107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(101 నాటౌట్)లు పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడారు. కాస్త కూడా అవకాశమివ్వకుండా ఇంగ్లండ్ బౌలర్లను అలసిసొలసిపోయేలా చేశారు. ఐదో వికెట్‌కు అజేయంగా 203 రన్స్ జోడించి అసాధ్యమనుకున్న డ్రాను సుసాధ్యం చేసి చూపించారు.