భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో.. పేసర్ బుమ్రా నిప్పులు చెరుగుతుండటంతో ఇంగ్లండ్ టాపార్డర్ వణికిపోయింది. మిడిలార్డర్ కూడా అతని ప్రతాపం ముందు తలవంచింది. స్టార్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ (0) కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బుమ్రా వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించిన లివింగ్‌స్టోన్.. పూర్తిగా మిస్సయ్యాడు.
ఈ క్రమంలో అతని వెనుక నుంచి వెళ్లిన బంతి వికెట్లను కూల్చింది. దాంతో లివింగ్‌స్టోన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 8 ఓవర్లలో 26/5 స్కోరుతో నిలిచింది. వాటిలో నాలుగు వికెట్లు బుమ్రా తీసినవే కావడం గమనార్హం.