భారీ లక్ష్య ఛేదనలో భారత ఇన్నింగ్స్ చక్కదిద్దడంలో సహకరించిన శ్రేయాస్ అయ్యర్ (28) పెవిలియన్ చేరాడు. టాప్లే వేసిన 16వ ఓవర్ తొలి బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను.. వెనకడుగు వేసి థర్డ్‌మ్యాన్ వైపు పంపేందుకు ప్రయత్నించాడు. అయితే అది విఫలమవడంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ బట్లర్ సులభంగా అందుకున్నాడు. దాంతో శ్రేయాస్ ఇన్నింగ్స్ ముగిసింది.