భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే పూర్తిగా ఏకపక్షంగా సాగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు భారత పేస్ దళం చుక్కలు చూపించింది. షమీ, బుమ్రా బౌలింగ్ ఆడలేక ఇంగ్లిష్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ క్రమంలో భారత మాజీ దిగ్గజం వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సిరీస్‌లో మిగిలిన రెండు వన్డేలకు ఎలాంటి పిచ్‌లు ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంగ్లండ్ గట్టిగా ఆలోచించాల్సి ఉంటుందని చురకలేశాడీ మాజీ క్రికెటర్. భారత్‌ను పేస్ పిచ్‌తో బెంబేలెత్తించాలని ఇంగ్లండ్ అనుకుంటే.. షమీ, బుమ్రా అదే ప్లాన్‌ను ఇంగ్లండ్ ఆటగాళ్లపై అమలు చేశారని జాఫర్ అన్నాడు.
పిచ్ నుంచి ఏమాత్రం సహకారం అందినా వీళ్లిద్దరూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతారని, హార్దిక్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడని వెల్లడించాడు. కాబట్టి మిగతా మ్యాచుల్లో ఎలాంటి పిచ్‌లు ఏర్పాటు చేయాలనే విషయంలో ఇంగ్లండ్ చాలా గట్టిగా ఆలోచిస్తుందన్నాడు.
తొలి వన్డేలో టాస్ ఓడిపోవడం కూడా ఇంగ్లండ్‌ను ముంచిందని అభిప్రాయపడ్డాడు. ది ఓవల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు 110 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ లక్ష్యాన్ని భారత జట్టు 18.4 ఓవర్లలోనే ఛేదించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.