భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 10వ ఓవర్ మూడో బంతికి ఫిల్ సాల్ట్ (8) పెవిలియన్ చేరాడు. హర్షల్ వేసిన లో ఫుల్టాస్ను భారీ షాట్ ఆడేందుకు సాల్ట్ ప్రయత్నించాడు. అయితే పేస్ లేకుండా వచ్చిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు.
దాంతో అతని బ్యాటును తప్పించుకున్న బాల్.. నేరుగా వికెట్లను కూల్చింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి చక్కని టైమింగ్తో ఆడుతున్న సాల్ట్ ఇన్నింగ్స్.. ఆ డెలివరీతో ముగిసింది. పది ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ జట్టు 86/3 స్కోరుతో నిలిచింది.