టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసుకున్నాడు. ఆఫ్‌స్టంప్ ఆవలగా వేసిన అవుట్ స్వింగర్‌ను డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించిన రాయ్.. బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్‌లో ఉన్న రోహిత్ వైపు వెళ్లింది. అతను దాన్ని సులభంగా అందుకోవడంతో తొలి బంతికే ఇంగ్లండ్ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. రాయ్ వెనుతిరగడంతో డేవిడ్ మలాన్ క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వని భువీ.. ఛేజ్‌లో తొలి ఓవర్‌ను వికెట్ మెయిడెన్‌గా ముగించాడు.