PKL | ముంబై: దేశ ఆర్థిక రాజధాని వేదికగా రెండ్రోజులుగా జరిగిన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలం విజయవంతంగా ముగిసింది. 11వ సీజన్ కోసం వేలాన్ని నిర్వహించగా రెండ్రోజుల్లో మొత్తం 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తొలి రోజే సచిన్ తన్వర్‌ను తమిళ్ తలైవాస్ రూ. 2.15 కోట్లతో ఈ సీజన్లో అత్యధిక ధరకు కొనుగోలు చేయగా రెండో రోజు అజిత్ వి. కుమార్ (పూణె – రూ. 66 లక్షలు) పంట పండింది.
జై భగవాన్ను బెంగళూరు జట్టు రూ. 63 లక్షలకు సొంతం చేసుకుంది. పీకేఎల్ చరిత్రలో తొలిసారిగా ఏకంగా 8 మంది ఆటగాళ్లు కోటి రూపాయల మార్కును దాటడం విశేషం. వేలంలో స్టార్ ఆటగాళ్లతో పాటు కేటగిరి- సీ, డీ ప్లేయర్లకూ భారీ డిమాండ్ ఏర్పడిందని లీగ్ కమిషన్, మషాల్ హెడ్ స్పోర్ట్స్ లీగ్స్ హెడ్ అనుపమ్ గోస్వామి తెలిపారు. తెలుగు టైటాన్స్ రూ. 1.72 కోట్లతో పవన్ సెహ్రావత్‌ను అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే.