e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home News US Open | మహిళల సింగిల్స్‌ విజేతగా ఎమ్మా రెడుకాను

US Open | మహిళల సింగిల్స్‌ విజేతగా ఎమ్మా రెడుకాను

వాషింగ్టన్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో 18 ఏండ్ల బ్రిటిష్‌ యువసంచలనం ఎమ్మా రెడుకాను చరిత్ర సృష్టించింది. అత్యంత చిన్నవయస్సులోనే గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ గెల్చుకుని సత్తా చాటింది. కెనడాకు చెందిన లైలా ఫెర్నాండెజ్‌తో జరిగిన ఫైనల్‌లో 6-4, 6-3 తేడాతో ఓడించింది. దీంతో 44 ఏండ్ల తర్వాత గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ గెలిచిన బ్రిటిష్‌ మహిళగా రికార్డు సృష్టించింది.

మారియా షరపోవా తర్వాత అత్యంత పిన్నవయస్సులో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ గెలుపొందిన టీనేజర్‌గా ఎమ్మా నిలిచింది. షరపోవా 2004లో తన 17 ఏండ్ల వయసులో వింబుల్డన్‌లో విజయం సాధించింది. 1999లో మార్టినా హింగిస్‌ తన 18వ ఏట యూఎస్‌ ఓపెన్‌ గెలుపొందింది.

నేడు పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌

- Advertisement -

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌ ఆదివారం జరగనుంది. ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ జకోవిచ్‌, ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న మెద్వెదేవ్‌తో తలపడునున్నాడు. జకోవిచ్‌ ఇప్పటివరకు 20 గ్రాడ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే క్యాలెండర్‌ ఇయర్‌ గ్రాండ్ స్లామ్స్‌ సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement