పారిస్: పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియాకు చెందిన మహిళా బాక్సర్ ఇమేనీ ఖాలిఫ్(Imane Khelif)పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. జండర్ వివాదంలో ఉన్న ఆమెపై .. బిలియనీర్ ఎలన్ మస్క్, రచయిత జేకే రౌలింగ్ కామెంట్ చేశారు. దీంతో ఆ ఇద్దరితో పాటు మరికొందరిపై బాక్సర్ ఖాలిఫ్.. కేసు బుక్ చేసింది. ఓ మ్యాచ్‌లో ఇటలీ బాక్సర్.. బౌట్ నుంచి మధ్యలోనే తప్పుకున్నది. ఖాలిఫ్తో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ఆమె నిరాకరించింది. ఆమెలో పురుష హార్మోన్లు ఉన్నట్లు ఆరోపించారు. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి ఆమె డిస్క్వాలిఫై అయ్యింది.
అయితే పారిస్ ఒలింపిక్స్ సమయంలో.. ఇమేనీ ఖాలిఫ్‌పై ట్రోలింగ్ జరిగింది. మస్క్, రౌలింగ్ కూడా ఆమెను ట్రోల్ చేశారు. ఆ ఇద్దరిపై లీగల్ ఫిర్యాదు నమోదు అయినట్లు అమెరికాకు చెందిన వెరైటీ మ్యాగ్జిన్ తెలిపింది. ఇద్దరి పేర్లను లీగల్ ఫిర్యాదులో దాఖలు చేసినట్లు పారిస్‌కు చెందిన న్యాయవాది నాబిల్ బౌడీ తెలిపారు. ఈ కేసు విచారణలో ట్రంప్‌ను కూడా లాగినట్లు తెలుస్తోంది. మహిళల క్రీడల్లో పురుషులకు స్థానం లేదని అమెరికా స్విమ్మర్ రిలే గెయిన్స్ చేసిన ట్వీట్‌ను మస్క్ రీట్వీట్ చేశాడు.
Absolutely https://t.co/twccUEOW9e
— Elon Musk (@elonmusk) August 1, 2024
అల్జీరియా బాక్సర్‌ను పురుషుడితో పోలుస్తూ హ్యారీ పోటర్ క్రియేటర్ జేకే రౌలింగ్ పేర్కొన్నారు. ఆరోపణలు ఎన్ని ఉన్నా.. ఇమేనీ ఖాలిఫ్.. పారిస్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచింది.
Could any picture sum up our new men’s rights movement better? The smirk of a male who’s knows he’s protected by a misogynist sporting establishment enjoying the distress of a woman he’s just punched in the head, and whose life’s ambition he’s just shattered. #Paris2024 pic.twitter.com/Q5SbKiksXQ
— J.K. Rowling (@jk_rowling) August 1, 2024