WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్‌లో టైటిల్ కోసం నిరీక్షిస్తున్న గుజరాత్ జెయింట్స్ (Gujarat Gaints) కోచింగ్ యూనిట్‌ను బలోపేతం చేసుకుంటోంది. ఈసారి కప్పు కొట్టమే లక్ష్యంగా పెట్టుకున్న గుజరాత్ కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమించుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవమున్న ఇంగ్లండ్ వెటరన్ సారా టేలర్(Sarah Taylor)కు ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపరిచే బాధ్యత అప్పగించింది. ఈ విషయాన్ని మంగళవారం ఎక్స్ వేదికగా ఫ్రాంచైజీ ప్రకటించింది.
ఒకప్పడు వికెట్‌కీపింగ్‌లో అదరగొట్టి మహిళా క్రికెట్లో ఎంఎస్ ధోనీ(MS Dhoni)గా కితాబులందుకుంది సారా టేలర్. ఆమె తన13 ఏళ్ల కెరీర్‌కు 2019లో వీడ్కోలు పలికింది. అనంతరం కోచ్‌గా అవతారమెత్తిన తను కౌంటీల్లో ఇంగ్లండ్ సీనియర్ జట్టుకు సేవలందించింది. జూనియర్ టీమ్ ఇంగ్లండ్ లయన్స్‌కు కోచింగ్ ఇచ్చిన సారా ఫీల్డింగ్ ప్రమాణాలు నెలకొల్పింది. దాంతో.. డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ కోసం ఆమెను గుజరాత్ జెయింట్స్ యాజమాన్యం సంప్రదించింది.
Mumbai, Maharashtra: At the Gujarat Giants (WPL) team season press conference, Fielding Coach Sarah Taylor says, “The focus is to get the girls ready for the first game on the 10th, while also ensuring they enjoy themselves and play with real aggression in the field. Matches can… pic.twitter.com/4aG14Cn5Aj
— IANS (@ians_india) January 6, 2026
‘సీజన్లో తొలి మ్యాచ్‌కు గుజరాత్ ప్లేయర్లను సిద్ధం చేయడంపై దృష్టి సారిస్తున్నా. మైదానంలో వారు తమ ఆటను ఆస్వాదిస్తూనే.. దూకుడు కనబరిచేలా చూస్తాను. మ్యాచ్‌లో గెలవడం, ఓడడం అనేది ఫీల్డింగ్ మీద ఆధారపడి ఉంటుంది. క్యాచ్‌లు పట్టడం, రనౌట్ చేయడం వంటివి మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి. కాబట్టి.. గుజరాత్ స్క్వాడ్‌లోని క్రికెటర్లు మైదానంలో చురుకుగా ఉండేలా శిక్షణ ఇస్తాను’ అని టేలర్ వెల్లడించింది. హెడ్‌కోచ్ మైఖేల్ క్లింగర్, బౌలింగ్ కోచ్ ప్రవీణ్ తంబే, అనలిస్ట్ సౌరభ్ వాల్కర్తో కలిసి సారా గుజరాత్ టైటిల్ కలను సాకారం చేసేందుకు కృషి చేయనుంది.
🚨 England legend Sarah Taylor joins the Gujarat Giants coaching setup! 🙌#CricketTwitter pic.twitter.com/AI4dVePyFv
— Female Cricket (@imfemalecricket) January 6, 2026
జనవరి 9 నుంచి డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ షురూ కానుంది. తమ తొలిపోరులో జనవరి 10న యూపీ వారియర్స్‌తో గుజరాత్ తలపడనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మ్యాచ్ జరుగనుంది. మూడు ఫార్మట్లలో 226 మ్యాచులు ఆడిన సారా .. 6,500 పరుగులు సాధించింది. మహిళా క్రికెట్‌కు విశేష సేవలందించిన ఇంగ్లండ్ వెటరన్‌కు 2025లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది.